భారతదేశం, ఏప్రిల్ 18 -- ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాము. అక్షయ తృతీయ నాడు కేవలం బంగారం మాత్రమే కొనాలి అనుకుంటే పొరపాటు. అక్షయ తృతీయ నాడు బంగారమే కొనక్కర్లేదు. కొన్ని పాటించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఆ రోజు ఇంటికి బంగారాన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లోనే ఉంటుందని, అక్షయంగా ఉంటుందని నమ్మకం. కానీ నీటి కుండను దానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. మట్టికుండను కడిగి, అందులో నీళ్లు, యాలకులు, పచ్చ కర్పూరం, లవంగాలు వేసి దానం చేయడం వలన మంచి ఫలితాన్ని చూస్తారు. అలాగే విసనకర్ర, గొడుగు, చాప, చెప్పులు వంటి విధానం చేస్తే కూడా ఎంతో పుణ్యం.

అక్షయ తృతీయ నాడు స్వయంపాకం ఇచ్చుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. చింతపండు, కూరలు, బియ్యం, పప్పు వంటి వంట సామాగ్రిని దానం చేయొచ్చు. అలాగే దంపతులు ఇద్దరు కలిసి జాకెట్ ముక్క, పసుపు, ...