భారతదేశం, అక్టోబర్ 4 -- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ) వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ విభాగాలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (psc.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీల సంఖ్య 73. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 29వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతన స్కేలు రూ.37,640 నుంచి రూ.1,15,500 మధ్య ఉంటుంది.

ఏపీ సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-21, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-23, ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్-29 పోస్టులు ఉ...