భారతదేశం, అక్టోబర్ 25 -- జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతిని సర్వశుభకారకుడిగా భావిస్తారు. జ్ఞానం, సంపద, సంతానం, వివాహం, అదృష్టానికి కారకుడైన గురుభగవానుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు.

ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురువు, రాబోయే అక్టోబర్ 31వ తేదీన సింహ రాశిలోకి అడుగుపెట్టనున్నారు. దాదాపు మూడు నెలల పాటు ఇదే రాశిలో సంచరించనున్న గురుని ఈ మార్పు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలం స్వర్ణయుగంగా మారనుందని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గురుని ఈ రాశి మార్పు మేష రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండనుంది. విద్యారంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. తాము పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఇది సరైన సమయం. ప్రేమ జీవితం సం...