భారతదేశం, సెప్టెంబర్ 16 -- శ్రీశైలంలో అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు నెల రోజుల పాటు కార్తీక మాసం ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్ల మీద ఆలయ అధికారులతో ఈవో శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం ఆలయ అధికారులు తెలిపారు. ఈ పవిత్ర సమయంలో సాంప్రదాయ ఆచారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు రానున్నారు. వసతి, తాగునీరు, క్యూ నిర్వహణ, జనసమూహ నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై అధికారులతో ఈవో శ్రీనివాసరావు చర్చించారు.

'భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందే అవసరమైన చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ 15 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వాలి. ఉత్సవాల్లో ప్రతీ కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశితోపాటు ప్రభుత్వ సెలవుల...