భారతదేశం, అక్టోబర్ 16 -- పాపాంకుశ ఏకాదశి: హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి విశేషమైన స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే ఏకాదశులకు ప్రత్యేక విశిష్టత ఉన్నప్పటికీ, ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పాపాంకుశ ఏకాదశికి సమస్త పాపాలను హరించే శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర రోజున భక్తులు పద్మనాభ వాసుదేవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సమస్త సుఖాలు, మోక్షం ప్రాప్తిస్తాయని విశ్వాసం.

ఈ ఏడాది పాపాంకుశ ఏకాదశి తేదీకి సంబంధించి భక్తులలో స్పష్టత ఉండటం ముఖ్యం. పంచాంగం ప్రకారం, అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 2:12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. అయితే ఆ రోజు దశమి యుక్త ఏకాదశి కావడంతో, ఉదయ తిథి ప్రకారం అక్టోబర్ 22వ తేదీన సూర్యోదయంతో ఏకాదశి వ్యాపించి ఉంటుంది.

ఆ రోజు మధ్యాహ్నం 2:49 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. కాబట్టి ద్వాదశి యుక్త ఏకాదశి వ్రతాన్ని అక్...