భారతదేశం, అక్టోబర్ 14 -- ఢిల్లీలో నిరసన సెగలు మరింత తీవ్రమవుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించిన నేపథ్యంలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 16న (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని వ్యాపార కేంద్రమైన కన్నాట్ ప్లేస్ (సీపీ) లోని సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాతో తరలిరావాలని దేశభక్తులకు ఆయన పిలుపునిచ్చారు.

"మువ్వన్నెల జెండాను ఎగురవేసినందుకే సౌరవ్, అశులను జైలుకు పంపారు. అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు జాతీయ జెండాతో కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌కు రావాలని దేశభక్తులందరినీ కోరుతున్నాను. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదని నిరూపిస్తాం" అని దిప్కే బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

ఢిల్లీకి రాలేని వారు తమ తమ...