భారతదేశం, అక్టోబర్ 17 -- అక్టోబర్ నెల సగం పూర్తయింది. రాబోయే పదిహేను రోజులు తమ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మిగిలిన రోజుల్లో కొన్ని ప్రత్యేక రాశుల వారికి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ రంగం నుంచి ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి.

మేషం, సింహం, కన్య, తులా, ధనుస్సు మరియు మకర రాశుల వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా మారనుంది. ఆయా రాశుల వారి జీవితాల్లో రాబోయే మార్పులేంటో ఇక్కడ పరిశీలిద్దాం.

మేష రాశి వారికి ఈ పదిహేను రోజులు ఆర్థికంగా, మానసికంగా ఎంతో ఊరటనిస్తాయి. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన పనులు పూర్తవుతాయి. చాలాకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కడంతో మనసుకు ప్రశాంతత దక్కుతుంది.

ఇక సింహ రాశి వారి పరాక్రమం ఈ కాలంలో గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది, తల...