భారతదేశం, అక్టోబర్ 13 -- కొన్ని నెలల వ్యవధిలో మారనున్న గ్రహాల గతులు కొందరి జీవితాల్లో గొప్ప మార్పులకు నాంది పలకనున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి డిసెంబర్ చివరి నాటికి గురు, శని, రాహు-కేతువుల స్థాన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 31న గురుడు సింహ రాశిలోకి ప్రవేశించనుండగా, డిసెంబర్‌లో శని వక్రి నివృత్తి మరియు రాహు-కేతువుల సంచారాలు జరగనున్నాయి.

జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహాల సంచార మార్పులు ఆర్థిక స్థితి, అదృష్టం, వృత్తి వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో మేష, కర్కాటకం, సింహం సహా ఏడు రాశుల వారికి ఈ చివరి 80 రోజులు అత్యంత శుభప్రదంగా మారనున్నాయి.

ఈ ఏడాది చివరి త్రైమాసికం ఉద్యోగులకు కెరీర్ పరంగా ఎంతో కీలకం కానుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ...