అక్టోబర్లో వృద్ధుల కోసం డోర్-టు-డోర్ హెల్త్ చెకప్స్.. ఇంట్లోనే ఫిజియోథెరపీ కూడా!
భారతదేశం, సెప్టెంబర్ 30 -- వృద్ధులలో ఆరోగ్య సమస్యలను ముందస్తు దశలోనే గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైన వైద్య సేవలను అందించేందుకు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక వైద్య కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ.. వృద్ధులు ఆసుపత్రులకు వచ్చే వరకు వేచి ఉండకుండా ఆరోగ్య బృందాలు వారి ఇళ్ల వద్దకే చేరుకుంటాయని తెలిపారు. ఈ బృందాలు వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, ఫిజియోథెరపీ, పునరావాస సేవలను అందిస్తాయి.
ప్రతి ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్త ప్రతి వారం కనీసం ఐదుగురు వృద్ధుల ఇళ్లను సందర్శించి ఫిజియోథెరపీ, ఇతర సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. Comprehensive Ge...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.