భారతదేశం, సెప్టెంబర్ 24 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్- చర్లపల్లి, పోదనూర్ - బరౌని మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్‌లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగకరంగా ఉంటాయి. బీహార్, తమిళనాడు ప్రజలు కూడా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఎన్ని సర్వీసులు, ఏ తేదీల్లో ఉన్నాయో చూడండి.

ట్రైన్ నెంబర్ 07062 నరసాపురం - చర్లపల్లి ఆదివారం రాత్రి 10 గంటలకు బయల్దేరుతుంది. సోమవారం ఉదయం 8.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 04.10.2026 నుండి 29.11.2026 వరకు 9 సర్వీసులు నడుస్తాయి.

ట్రైన్ నెంబర్ 07063 చర్లపల్లి - నర్సాపూర్ సోమవారం రాత్రి 7.50 బయల్దేరి మంగళవారం ఉదయం 7.00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. 05.10.2026 నుండి 30.11.2026 వరకు 9 సర్వీసులు ఉంటాయి.

నరసాపూర్ - చర్లపల్లి- నరసాపూర్ నడుమ మ...