భారతదేశం, అక్టోబర్ 29 -- బంగాళాఖాతంలో తుపాను కారణంగా అంతర్వేది సమీపంలో సముద్రంలో నౌక చిక్కుకుంది. విశాఖ నుంచి సింగపూర్ వెళ్తున్న నౌకగా గుర్తించారు. ఈ మర్చంట్ షిప్‌లో చిక్కుకున్న వారిని హెలీకాప్టర్ ద్వారా రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ చర్యలు ముమ్మరం చేసింది.

ఇప్పటికే 13 మందిని ఇండియన్ కోస్టు గార్డ్ షిప్ SUJAY లోకి సురక్షితంగా చేర్చారు కోస్టు గార్డ్ అధికారులు. ఇంకా నౌకలోనే మరో ఏడుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది.

మిగిలిన సిబ్బందిని తరలించేందుకు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను మోహరించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పదమూడు మందిని కోస్ట్ గార్డ్ నౌక సుజయ్‌కు సురక్షితంగా తరలించగా , మరో ఏడుగురు వాణిజ్య నౌకలోనే ఉన్నారు.

అర్నబ్ తుపాన్ ప్ర...