భారతదేశం, జూన్ 25 -- అంతరిక్ష యాత్రకు బయలుదేరిన శుభాన్షు శుక్లా స్పేస్ క్రాఫ్ట్ ఎక్కిన తర్వాత భారతీయులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. స్పేస్ క్రాఫ్ట్ లో 10 నిమిషాల ప్రయాణం అనంతరం శుభాన్షు ఓ సందేశంలో.. 'నమస్కారం నా ప్రియమైన దేశప్రజలారా. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలో ఉన్నాం. ఇది మరపురాని ప్రయాణం. మనం సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా భుజాలపై భారతదేశ త్రివర్ణ పతాకం ఉంది.' అని శుభాన్షు చెప్పారు. నాలుగు దశబ్దాల కిందట 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు శుభాన్షు శుక్లా రెండో భారతీయుడు.

శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి 'ఆక్సియమ్-4' మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి చరిత్ర సృష్టించారు. ఆక్సియమ్ స్పేస్ వాణిజ్య మిషన్‌లో భాగంగా బుధవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్...