భారతదేశం, మే 7 -- ప్రపంచం కోవిడ్ భయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, మరో ప్రాణాంతక వైరస్ వార్త కలకలం రేపుతోంది. అంటార్కిటికా విహారయాత్రకు వెళ్ళిన ఒక విలాసవంతమైన నౌకలో హంటావైరస్ (Hantavirus) విజృంభించింది.

అర్జెంటీనా నుండి ఏప్రిల్ 1న అంటార్కిటికా పర్యటనకు బయలుదేరిన MV హోండియస్ నౌకలో ఈ వైరస్ బయటపడింది.

ఏప్రిల్ 11: 70 ఏళ్ల డచ్ పౌరుడు మరణించాడు.

ఏప్రిల్ 26: ఆయన భార్య (69 ఏళ్లు) కూడా వైరస్ బారిన పడి మృతి చెందింది.

మే 2: ఒక జర్మన్ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

మొదట వీటిని సాధారణ మరణాలుగా భావించినా, దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్న మరో బ్రిటీష్ ప్రయాణికుడికి పరీక్షలు చేయగా 'హంటావైరస్' అని తేలింది. ప్రస్తుతం ఈ షిప్‌లోని ప్రయాణికులందరినీ వారి గదులకే పరిమితం (Isolation) చేసి పర్యవేక్షిస్తున్నారు.

హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల వంటి ...