భారతదేశం, ఏప్రిల్ 2 -- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి(ఏప్రిల్ 1) నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో దాదాపు 80 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. టీటీడీకి చెందిన అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశాయి.
రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.