భారతదేశం, జూలై 19 -- Zee5 OTT List: డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ మరో లెవెల్ లో అందించేందుకు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 రెడీ అవుతోంది. క్రేజీ సినిమాలు, సిరీస్ లను ఓటీటీలోకి తీసుకు రానుంది. తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్ వివరాలను జీ5 ఓటీటీ ఇవాళ (జూలై 19) అనౌన్స్ చేసింది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఆ తర్వాత జీ5 ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

నందమూరి బాల‌కృష్ణ క్రేజీ అప్ కమింగ్ మూవీ 'ఎన్‌బీకే111 (వర్కింగ్ టైటిల్)' కూడా జీ5 ఓటీటీలోకే రానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ...