భారతదేశం, జూలై 29 -- Zee5 OTT: ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీలింగ్వల్ కంటెంట్ స్లేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అగ్ర నటీనటులు నటించిన భారీ వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, రియాలిటీ షోలు, కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జీ5 మైండ్ బ్లాకింగ్ లైనప్‌ను ఆవిష్కరించింది. ఓటీటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ భారతీయ సంస్కృతికి అద్దం పట్టే కథలతో ముందుకెళ్తున్నట్లు జీ5 స్పష్టం చేసింది.

ఈ కొత్త కంటెంట్ స్లేట్‌లో జీ5 తెలుగు ఓటీటీ చాలా పెద్ద ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది. రీసెంట్‌గా '35 చిన్న కథ కాదు' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్ మెయిన్ లీడ్‌గా 'శ్రీమతి' అనే ఒరిజినల్ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఉమెన్ సె...