భారతదేశం, ఏప్రిల్ 16 -- Zee Telugu: బుల్లితెరపై మళ్ళీ పండగ వాతావరణం మొదలుకాబోతోంది. సమ్మర్ హాలిడేస్ లో ఇంటిల్లిపాదిని అలరించేందుకు జీ తెలుగు తన అమ్ముల పొదిలోని అస్త్రాలను సిద్ధం చేసింది. కేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా.. రియాలిటీ షోలు, కామెడీ డ్రామాలు, బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను టీవీల ముందే కట్టిపడేసేందుకు భారీ ప్లాన్ వేసింది.

చాలా కాలం విరామం తర్వాత సీనియర్ నటి రోజా మళ్ళీ యాంకర్‌గా మెరవబోతున్నారు. ఆమెతో పాటు ప్రముఖ సింగర్, యాంకర్ సమీరా భరద్వాజ్ కలిసి సందడి చేయనున్న కొత్త షో 'ది ఫ్యామిలీ అసెంబ్లీ'. ఏప్రిల్ 19వ తేదీ నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.

ఈ షోలో సమీరా భరద్వాజ్ 'రాజ్యం' అనే ఒక ఔత్సాహిక నటి పాత్రలో కనిపించనున్నారు. రోజా ఇంట్లోకి అద్దెకు వచ్చే అల్లరి అమ్మాయిగా ఆమె చేసే హంగామా, వీరిద్దరి మధ...