భారతదేశం, జూన్ 17 -- Your Fault London on Prime: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో బోల్డ్ రొమాంటిక్ డ్రామాలు, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లకు ఎప్పుడూ క్రేజీ ఆడియన్స్ బేస్ ఉంటుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విభాగంలో గ్లోబల్ వ్యూవర్స్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతోంది. గతంలో భారీ వ్యూవర్‌షిప్ సాధించిన 'మై ఫాల్ట్: లండన్' చిత్రానికి సీక్వెల్‌గా 'యువర్ ఫాల్ట్: లండన్' ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి మరో హాట్ అండ్ బోల్డ్ ఫిల్మ్ వచ్చేసింది. 'యువర్ ఫాల్ట్ లండన్' ఈ రోజు (జూన్ 17) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ లండన్ ఫ్రాంచైజీకి మూలం స్పానిష్‌లో సూపర్ హిట్ అయిన మెర్సిడెస్ రాన్ నవల ...