భారతదేశం, ఆగస్టు 8 -- Yash: కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో రాకింగ్ స్టార్ యశ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటివరకూ కేవలం కన్నడ పరిశ్రమలోనే హీరోగా తెలిసిన యశ్.. కేజీఎఫ్ సినిమాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే నటుడిగా మారాడు. అలాంటి కేజీఎఫ్ తర్వాత, భారీ అంచనాల నడుమ యశ్ చేస్తున్న సినిమా 'టాక్సిక్'. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా యశ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

టాక్సిక్ ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 8) రిలీజ్ చేశారు. బెంగళూరులో ఈ ఈవెంట్ జరిగింది. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా యశ్ మాట్లాడాడు. తాను ఎవరికీ వినే రకం కాదని యశ్ స్పష్టం చేశాడు. ఇంపాజిల్ అనే విషయాన్ని చేసి చూపించడం తనకు అలవాటని పేర్కొన్నాడు.

''లైఫ్ లో ఏదైనా చేయాలని గట్టిగా ఫిక్స్ అయితే ఏదీ మనల్ని ఆపదు. నేను ఇదే విషయాన్ని నమ్ముతా. చెడ్డ విషయాలు చెప్పే మాటలను చాలా మంది వింటుంటా...