భారతదేశం, మే 29 -- Yamuna Pushkaralu 2026: బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్లినప్పుడు, ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు మొదలవుతాయి. ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ కాలాన్ని యమునా పుష్కర మహోత్సవంగా భక్తులు జరుపుకుంటారు.

పుష్కరాల్లో మొదటి 12 రోజులను ఆది పుష్కరాలు అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని అంటారు. లక్షలాది మంది దూర ప్రాంతాల నుంచి కూడా యమునా నది తీరాలకు వచ్చి స్నానాలు, పూజలు చేస్తూ ఉంటారు.

యమునా పుష్కరాలు జూన్ 2, మంగళవారం నాడు ప్రారంభమవుతాయి. జూన్ 13, శనివారంతో ముగుస్తాయి. యమునా నదిలో పుష్కర స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని, అలాగే పితృ దోషాల నుంచి కూడా బయటపడొచ్చని పురాణాలు చెబుతున్నాయి.

ఢిల్లీ, యమునానగర్, బృ...