భారతదేశం, అక్టోబర్ 30 -- రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట కొండపైన నూతనంగా నిర్మించతలపెట్టిన కళ్యాణ మండప నిర్మాణ పనులకు సంబంధించి భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, శాస్త్రోక్త పూజా విధానాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ భూమిపూజ మహోత్సవంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యతో పాటు యాదగిరిగుట్ట దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నూతన కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వారు తెలిపారు.

భక్తులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ...