భారతదేశం, మే 24 -- Trump White House shooting : అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అత్యంత భద్రత కలిగిన వైట్ హౌస్ పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ నార్త్‌వెస్ట్ మూలలో ఈ కాల్పులు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు ధృవీకరించారు.

ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఒక గుర్తుతెలియని వ్యక్తి (పురుషుడు) వైట్ హౌస్ వెస్ట్ సైడ్ లోని గేట్ 17 సమీపంలోకి వచ్చి అకస్మాత్తుగా పిస్టల్‌ను గాల్లోకి లేపి కాల్పులు ప్రారంభించాడు. దుండగుడు దాదాపు మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఆ తర్వాత డజన్ల కొద్దీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపైకి కూడా అతను కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ పహారా దళాలు ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని అక్కడికక్...