భారతదేశం, జూన్ 20 -- ఈ వారం గ్రహాల గమనంలో వస్తున్న మార్పులు మీ జీవితంలోని వివిధ కోణాలపై ప్రభావం చూపనున్నాయి. కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో ఎవరికి అనుకూలంగా ఉంది? ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పని ఒత్తిడితో వారం ప్రారంభం కావచ్చు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు మీపై పడతాయి. ప్రారంభంలో కొంత ఆందోళనగా అనిపించినా, క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ పెద్దల సలహాలు మీ సమస్యలను సులభతరం చేస్తాయి. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. వారాంతంలో పాత మిత్రులతో మాట్లాడే అవకాశం ఉంది.

వారమంతా సమతుల్యంగా సాగుతుంది. వృత్తి, కుటుంబ బాధ్యతల మధ్య సమన్వయం అవసరం. ఉద్యోగులకు కాలం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో కల...