భారతదేశం, ఏప్రిల్ 25 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం ప్రతి వారం మన జీవితాలపై కొత్త ప్రభావాన్ని చూపుతుంది. ఏప్రిల్ 26న ప్రారంభమయ్యే ఈ వారం గ్రహాల పరంగా చాలా కీలకమైనది. ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీన బుధుడు మీన రాశిని వీడి మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే మేషంలో ఉన్న సూర్యుడితో బుధుడు కలవడం వల్ల 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది.

సాధారణంగా బుధాదిత్య యోగం మేధస్సును, వ్యాపార దక్షతను, కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. ఈ వారంలో శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభంలో, గురువు మిథునంలో, శని-మంగళ గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. ఇన్ని గ్రహాల మార్పుల మధ్య ప్రధానంగా 4 రాశుల వారికి ఈ వారం అదృష్ట ఘడియలు మొదలుకానున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి వారికి ఈ వారం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి...