భారతదేశం, మే 4 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాల కదలికలు మన దైనందిన జీవితాన్ని, ముఖ్యంగా వృత్తి, వ్యాపార మరియు కుటుంబ వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. మే 4వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త వారంలో గ్రహ గతులు కొన్ని రాశుల వారికి రాజయోగాన్ని కలిగిస్తుంటే, మరికొన్ని రాశుల వారు అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా ఉండాలని నక్షత్ర గమనం సూచిస్తోంది.

ముఖ్యంగా ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమరపాటుగా ఉంటే నష్టపోయే ప్రమాదం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. మరి మే 4 నుంచి మే 10 వరకు మీ వార ఫలాలు తెలుసుకోండి.

ఈ వారం ప్రారంభంలో మీకు కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. పని మీ కళ్ల ముందే ఉన్నా, మనసు మాత్రం సహకరించదు. పనులను వాయిదా వేయాలనే ఆలోచనను విడనాడండి. మంగళవారం తర్వాత పరిస్థితి అదుపులోకి వస...