భారతదేశం, నవంబర్ 11 -- Web Series OTT: జియోహాట్‌స్టార్ (JioHotstar) రెండు అదిరిపోయే వెబ్ సిరీస్‌లతో ఈ వారం ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. సరికొత్త టైమ్-ట్రావెల్ కాన్సెప్ట్‌తో 'పుష్పక విమానం', క్రైమ్ అండ్ థ్రిల్లర్ అంశాలతో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ఈ వారం మీరు తప్పక చూడాల్సిన ఈ టాప్ 2 సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

గతంలోకి వెళ్లి మన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వస్తున్న సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ 'పుష్పక విమానం' (Pushpaka Vimanam). హీరో సాయి రోనక్ 'పుష్పక్ రావు' అనే లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సిరీస్‌కు సతీష్ రెడ్డి మల్లిడి దర్శకత్వం వహించారు.

తన జీవితంలో జరిగిన రెండు పెద్ద తప్పులను తలుచుకుంటూ బాధపడే ఒక యువకుడు....