భారతదేశం, ఏప్రిల్ 28 -- మనకి మొత్తం 12 రాశులు. ఈ రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, రాశుల వారి పేరు, ప్రవర్తన గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. అయితే ఏ రాశుల వారు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంటారు? డబ్బు కొరత ఉండదు? ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు? మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

వృషభ రాశి వారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని అనుగ్రహంతో సంపద, విలాసాలు, డబ్బుకి లోటు ఉండదు. పైగా ఈ రాశి వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, విలాసవంతమైన జీవితాన్ని కూడా ఈ రాశి వారు గడుపుతారు. ఈ రాశి వారికి విష్ణువు ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో ఏ బాధలో ఉండరు, ఆనందం ఎప్పుడూ వారితోనే ఉంటుంది.

తులా రాశి...