భారతదేశం, జూన్ 29 -- చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని జ్యోతిష్య పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. జీవితమంటే కష్టసుఖాల సమరం. అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు... ఇలా ఏదో ఒకటి వేధిస్తూ ఉంటుంది. వీటి వెనుక ప్రతికూల శక్తులు, గ్రహస్థితులు, వాస్తు దోషాలు కారణం అవ్వచ్చు. అలాంటప్పుడు వాటి నుంచి బయట పడడానికి, జీవితంలో సుఖసౌభాగ్యాలను పొందడానికి పెద్దలు సూచించిన కొన్ని సులువైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుని పాటించండి.

వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతున్నా, ఎవరి దృష్టి తగిలిందో అని భయపడుతున్నా, అమావాస్య లేదా శనివారం ఉదయం నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కోసి, కొన్ని ఆవాలు, మిరియాలు, లవంగాలను మీ వ్యాపార స్థలంలో పెట్టండి. సాయంత్రం అయిన తర్వాత వీటన్నింటినీ నల్లటి వస్త్...