భారతదేశం, మార్చి 6 -- హైదరాబాద్ నగరవాసులకు జలమండలి మరోసారి అలర్ట్ ఇచ్చింది. న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ లోని పంప్ హౌస్ లో 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించనున్నారు. వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇక పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిమీ డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను మార్పు చేస్తారు. సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిమీ డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను మార్పు చేయటంతో పాటు పలు మరమ్మతు పనులు చేపడుతున్నారు.

మార్చి 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు(36 గంటలు) ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

నీటి సరఫరాలో...