భారతదేశం, సెప్టెంబర్ 16 -- Vvan Trailer: బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvaan: Force Of The Forest) ట్రైలర్ రిలీజ్ అయింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

ముంబైలో హ్యాపీగా జీవించే భార్యాభర్తలుగా సిద్ధార్థ్, తమన్నా కనిపించారు. ఛత్ పూజ వేడుకల కోసం తమ సొంత ఊరికి తిరిగొచ్చిన ఈ జంటకు అక్కడ ఊహించని భయంకర పరిస్థితులు ఎదురవుతాయి.

గ్రామంలో ఉండే 'వాన్ దేవి' పవిత్ర అడవిని నాశనం చేసి బిల్డింగ్‌లు కట్టడానికి విలన్ క్యారెక్టర్ (సునీల్ గ్రోవర్) ప్లాన్ చేస్తాడు. అయితే రాత్రి వేళ ఆ అడవిలోకి ఎవరు వెళ్లినా ప్రాణాలతో తిరిగి రారనే భయంకరమైన నమ్మకం గ్ర...