భారతదేశం, మార్చి 5 -- టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య, బ్లాక్ బస్టర్ 'విరూపాక్ష' డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ మూవీ 'వృషకర్మ'పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన 2 నిమిషాల గ్లింప్స్ వీడియో, సినిమాలోని గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్‌ను పరిచయం చేసింది. దైవ శక్తికి, క్షుద్ర శక్తికి మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

నాగ చైతన్య లీడ్ రోల్ పోషిస్తున్న వృషకర్మ మూవీ గ్లింప్స్ ప్రారంభంలో స్పర్ష్ శ్రీవాస్తవ పాత్రను అత్యంత భీతిగొల్పేలా చూపించారు. క్షుద్ర మాంత్రిక విద్యలతో ఇంట్లోనే ఉంటూ ఒక వ్యక్తిని చంపే సీన్, అతని శరీరంలో కలిగే మార్పులు ప్రేక్షకులను వణికించేలా ఉన్నాయి.

"ప్రకృతికి విరుద్ధమైన శక్తులు మేల్కొన్నప్పుడు.. వాటిని అడ్డుకోవడానికి విధి ఒక 'వృషకర్మ'ను ఎంచుకుంటుంది" అనే వాయిస్‌ఓవ...