భారతదేశం, మార్చి 6 -- క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆల‌యంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి. ఈ వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. టీటీడీ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడిన ఆయన. మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై, మార్చి 27న ధ్వజారోహ...