భారతదేశం, మార్చి 8 -- విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా 76.70 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లను వేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇది నగర దీర్ఘకాలిక రవాణా అవసరాలను తీరుస్తుందని అన్నారు. సీఐఐ విజయవాడ వార్షిక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. జాతీయ రహదారి-16 వెంట ప్రతిపాదించిన విశాఖపట్నం మెట్రో-కమ్-ఫోర్ లేన్ రోడ్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ మెట్రో మౌలిక సదుపాయాలను రోడ్డు రవాణాతో అనుసంధానించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని మెరుగుపరుస్తుందని రామకృష్ణారెడ్డి అన్నారు.

'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) విశాఖపట్నం గుండా వెళ్ళే NH-16 వెంట వివిధ జంక్షన్లలో 12 ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. తద్వారా సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగుతాయి.' అని మెట్రో రైల్ కా...