భారతదేశం, ఆగస్టు 5 -- Vismaya Mohanlal: డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మలయాళం మెగాస్టార్ గా ఎదిగారు మోహన్‌లాల్. ఇప్పుడు అతని కుటుంబం నుంచి మరొకరు సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే కొడుకు ప్రణవ్ హీరోగా ప్రూవ్ చేసుకోగా.. ఇప్పుడు కూతురు విస్మయ హీరోయిన్ గా మారింది. తన ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దక్షిణాది చిత్రసీమలో అత్యంత ఆదరణ పొందిన కుటుంబాల్లో మోహన్‌లాల్ కుటుంబం ఒకటి. ఇప్పటికే ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ 'హృదయం', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మలయాళంలో క్రేజీ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ (Vismaya Mohanlal) కూడా హీరోయిన్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది.

విస్మయ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొలి చిత్రం 'తుడక్కమ్'...