భారతదేశం, జూలై 24 -- Vishwanath & Sons: కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య (Suriya) కథానాయకుడిగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఒక షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా బైలింగ్వల్ లేదా స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదని, పూర్తిగా తమిళంలో మాత్రమే షూట్ చేసిన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగులో వచ్చేది కేవలం డబ్బింగ్ వర్షన్ మాత్రమేనని వెల్లడించడంతో టాలీవుడ్ ఆడియన్స్, సూర్య తెలుగు ఫ్యాన్స్ తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. గలాటా ప్లస్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఇద్దరూ తెలుగువారు కావడంతో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా తెరకెక్కిస్తున్నారని అం...