భారతదేశం, మే 22 -- Vishnu Priya: సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారంటూ ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు రూపొందించిన ఓ మహిళా యూట్యూబర్‌పై ఆమె హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయిన విష్ణుప్రియ.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ ద్వారా వార్తల్లో నిలిచారు.

అయితే ఆమె పోస్ట్ చేస్తున్న కొన్ని వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని, యువతను తప్పుదోవ పట్టించేలా ఆమె వ్యవహరిస్తున్నారని నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. సబ్‌స్క్రిప్షన్ పేరుతో ఆమె లక్షలు గడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది....