భారతదేశం, మార్చి 1 -- మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం అక్కడ నివసిస్తున్న సామాన్యులతో పాటు ఇండియన్ సెలబ్రిటీలను కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటంతో దుబాయ్, అబుదాబి పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ భీకర పరిస్థితుల్లో 'కన్నప్ప' నటుడు మంచు విష్ణు కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.
తమ బంధువులను కలిసేందుకు దుబాయ్ వెళ్లిన మంచు విష్ణు.. అక్కడి ఆకాశంలో మిస్సైల్స్ దూసుకుపోతున్న భయంకరమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. క్షిపణులను అడ్డుకుంటున్నప్పుడు వచ్చిన భారీ శబ్దాలకు తన ఇల్లు కంపించిందని, తన చిన్న కూతురు ఐరా ప్రాణభయంతో వణికిపోయిందని విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు.
"ఏ చిన్నారి కూడా తన ఇంటి పైకప్పు పైన యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదు. శాంతి నెలకొనాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.