భారతదేశం, మార్చి 12 -- సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వివాదాలతోనే సావాహం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గతంలో ఓ వేదికపై బ్రహ్మానందం గురించి అనకూడని మాట అన్నారు. ఆ తర్వాత ఓ పెళ్లి ఈవెంట్లో సెల్ఫీ అడిగిన ఓ బాలుడిని తోసేశారు. ఇప్పుడేమో తమిళ దిగ్గజ నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో 'కళాప్రపుర్ణ కాంతారావు జాతీయ అవార్డు' ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నోరు జారారు. ''ఒకప్పుడు కాంతారావు జానపదా చిత్రాల కోసం జనాలు ఎగబడేవాళ్లు. కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవాడు. కాంతారావును చూస్తే ఎంజీఆర్ కు ఉ**'' అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఎంజీఆర్ ను రాజేంద్ర ప్రసాద్ నోటికొచ్చిన మాటలు అనడంపై తమిళనాడు ప్రజలు, కోలీవుడ్ సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. హీరోలు క...