భారతదేశం, ఫిబ్రవరి 26 -- నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన్న దేవరకొండగా మారింది. చాలా రోజులుగా ప్రేమిస్తున్న విజయ్ ను ఆమె ఈ రోజు పెళ్లి చేసుకుందని తెలిసింది. ఉదయ్ పూర్ లో విరోష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగిందని సమాచారం. తెలుగు సంప్రదాయం ప్రకారం రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడని టాక్.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2018లో వచ్చిన గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. అప్పటి నుంచి వీళ్లు తమ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. గురువారం (ఫిబ్రవరి 26) వీళ్లు పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అత్తారింట్లో ఎవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ జిల్లా విరాజ్ పేటలో పుట్టింది. ఆమె తండ్...