భారతదేశం, ఫిబ్రవరి 25 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో కలిసిపోనున్నారు. ఫిబ్రవరి 26న విరోష్ వెడ్డింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో విజయ్ దేవరకొండకు కాల్ చేసిన రష్మిక అతని మాటలతో సిగ్గుపడుతుంది.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ చాలా కాలం నుంచే డేటింగ్ లో ఉన్నారు. వీళ్ల రిలేషన్ షిప్ పై చాలా వార్తలు వచ్చినా వీళ్లు రియాక్ట్ కాలేదు. కానీ కలిసి బయట కనిపించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షోలో విజయ్, రష్మిక మధ్య క్యూట్ మూమెంట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అప్పుడు విజయ్ కు రష్మిక ఫోన్ చేసింది.

2023లో రష్మిక, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన యానిమల్ మూవీ వచ్చింది. దీనికి సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్. ఈ టీమ్...