భారతదేశం, మార్చి 29 -- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శుభారంభం చేసింది. ఫస్ట్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కెమిస్ట్రీనే హైలైట్ గా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అదరగొట్టాడు. అజేయ హాఫ్ సెంచరీతో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసి తర్వాత స్టాండ్స్ లో ఉన్న అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ పంపించాడు విరాట్. అనుష్క కూడా అలాగే రియాక్టయింది.

ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్‌ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విరుష్క జోడీ కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్లు వస్తున్నాయి. ఈ జంట ఇప్పటికీ ప్రేమికుల్లాగే ఉన్నారని నెటిజన్లు అంట...