Hyderabad, అక్టోబర్ 1 -- చెడుపై మంచి గెలిచిందని విజయదశమిని జరుపుకుంటాము. పురాణాల ప్రకారం రాక్షసుల సంహారం అయిన తర్వాత అమ్మవారు కోపంతో ఉన్నప్పుడు, ఇతర దేవతలు, మునులు, ప్రజలకు ఏం చేయాలనేది అర్థం కాలేదు. అప్పుడు అమ్మవారి అనంత శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వివిధ రకాలుగా పూజలు చేశారు, అమ్మవారిని శాంతించారు.

దాంతో అమ్మవారు శాంతించి భక్తులపై వరాలను అందించారు. అయితే అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి అలా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు సందేశాలు, కోట్స్ ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, మీకు తెలిసిన వారికి షేర్ చెయ్యండి.

దసరా నుంచి అందరికీ మేలు జరగాలని, సంతోషంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు..

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ అందరికీ విజయాలను అందించాలని కోరుకుంటూ, మీకు...