భారతదేశం, మార్చి 7 -- తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ భార్య సంగీత మరోసారి కోర్టును ఆశ్రయించింది. విజయ్ తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని సంగీత ఆరోపించింది. విడాకుల పిటిషన్ పై తీర్పు వచ్చేంతవరకూ అదే ఇంట్లో ఉండేలా అనుమతి ఇప్పించాలని కోర్టును కోరింది. తాజాగా విజయ్, త్రిష సంబంధం నేపథ్యంలో సంగీత మరో పిటిషన్ వైరల్ గా మారింది.

విజయ్ భార్య సంగీత మరోసారి కోర్టును ఆశ్రయించింది. తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని ఆమె కోర్టుకు వెల్లడించింది. తన విడాకుల పిటిషన్ పై కోర్టు కేసులో తీర్పు వచ్చేంతవరకు విజయ్ ఇంట్లో ఉండేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది.

కోర్టులో సంగీత మరో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. లండన్ కు చెందిన తనకు వేరే ఎక్కడా ఉండటానికి అనుమతి లేదని సంగీత పేర్కొంది. అ...