భారతదేశం, ఏప్రిల్ 23 -- Vijay Varma: బాలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ వర్మ తన పర్సనల్ లైఫ్ పరంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల 'మట్కా కింగ్' వెబ్ సిరీస్‌తో విశేష గుర్తింపు తెచ్చుకున్న అతను, తాజాగా ముంబై వీధుల్లో ఒక యువ నటితో కలిసి కనిపించడం ఇప్పుడు బిటౌన్‌లో కొత్త ఊహాగానాలకు తెరలేపింది.

ముంబైలోని ఒక ప్రముఖ జపనీస్ రెస్టారెంట్ నుంచి విజయ్ వర్మ, 'జవాన్' ఫేమ్ ఆలియా ఖురేషీ కలిసి బయటకు వస్తుండగా పాపరాజీల కంట పడ్డారు. వీరిద్దరూ చాలా క్యాజువల్ దుస్తుల్లో, ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా కారులో కూర్చుని కాసేపు ఏకాంతంగా చర్చించుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విజయ్ వర్మ రెండేళ్ల పాట...