భారతదేశం, మే 31 -- Vijay Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్, త్రిష జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఎం అయ్యాక త్రిషతో కలిసి విజయ్ కనిపించడం ఇదే తొలిసారి. స్టార్ హీరో అజిత్ తల్లి భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు విజయ్, త్రిష కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. వీళ్లిద్దరు ఒకే కార్లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దళపతి విజయ్, త్రిషకు సంబంధించిన ప్రతి విషయం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఈ జంట ఇప్పుడు మరోసారి కలిసి కనిపించడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి ఈ జోడీ వెళ్లింది. అజిత్ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళి అర్పించడంతో పాటు అజిత్ ను పరామర్శించేందుకు విజయ్, త్రిష వెళ్లారు.

ఒకే కార్లో విజయ్, త్రిష ప్రయాణించడంతో మరోసారి పుకార్లు గుప్పు...