భారతదేశం, మార్చి 5 -- తమిళ సూపర్ స్టార్, 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన భార్య సంగీత నుండి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి కారణమని భావిస్తున్న నటి త్రిషతో కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు వెళ్లడం గమనార్హం.

భార్య సంగీత స్వర్ణలింగంతో విడాకుల వివాదం నడుస్తుండగానే, గురువారం (మార్చి 5) రాత్రి చెన్నైలో జరిగిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ విందుకు దళపతి విజయ్, త్రిష జంటగా హాజరయ్యారు.

కలర్ కోఆర్డినేటెడ్ లుక్ లో వీళ్లు కనిపించారు. విజయ్ పట్టు చొక్కా, పంచె ధరించగా.. త్రిష అదే రంగులో ఉన్న పట్టుచీరలో మెరిసిపోయింది. వీరిద్దరూ ఒకే కారులో రావడం, కలిసి వేదికపైకి వెళ్లడం ...