భారతదేశం, మార్చి 14 -- రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఏమో జన నాయగన్ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత భార్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. మరోవైపు త్రిషతో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రికి మరో షాకిచ్చాడని తెలుస్తోంది.

దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రికి వ్యతిరేకంగా మారాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. తల్లి సంగీతకే అతను సపోర్ట్ చేస్తున్నాడని అంటున్నారు. విజయ్ మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో సంగీత విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లో తల్లికే జేసన్ సంజయ్ సపోర్ట్ గా నిలుస్తున్నాడని టాక్.

తల్లి సంగీతకు మద్దతుగా జేసన్ సంజయ్ తన పేరులో చిన్న మార్పు చేసుకున్...