భారతదేశం, ఏప్రిల్ 14 -- Vijay Reaction: దళపతి విజయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతుల మధ్య ఒక ఆసక్తికర సంఘటనతో వార్తల్లో నిలిచారు. కన్యాకుమారి ఎన్నికల ర్యాలీలో ఒక అభిమాని చూపించిన పాత ఫోటో ఆయన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేయగా, దానికి ఆయన స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, నటుడు విజయ్ ప్రస్తుతం తన నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కన్యాకుమారిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. వేలాదిగా తరలివచ్చిన జనసందోహంలో ఒక అభిమాని విజయ్, ఆయన భార్య సంగీత కలిసి ఉన్న ఒక పాత ఫోటోను ఫ్రేమ్ కట్టించి మరీ తీసుకువచ్చాడు.

ఎన్నికల ప్రచార రథంపై ఉన్న విజయ్ కంట ఈ ఫోటో పడగానే, ఆయన ముఖంలో ఒక్కసారిగా భావోద్వేగం కనిపించిం...