భారతదేశం, అక్టోబర్ 3 -- Vijay Rashmika Video: టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali). రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక బిహైండ్ ది సీన్ (BTS) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 'రణబాలి' చిత్రీకరణ సమయంలో షాట్ల మధ్య లభించిన విరామంలో రష్మిక మందన్న చేసిన వినోదాత్మక చేష్టల వీడియోను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో రణబాలిలా రష్మిక మారింది.

రీసెంట్ గా రిలీజైన రణబాలి టీజర్ అదిరిపోయింది. ఇందు...