భారతదేశం, మార్చి 1 -- టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వైవాహిక జీవితాన్ని ఆధ్యాత్మికంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట.. ఆదివారం (మార్చి 1) ఉదయం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని సందర్శించారు. పెళ్లి తర్వాత మొదటిసారిగా బయట కనిపించిన ఈ జంటను చూసేందుకు భక్తులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

హైదరాబాద్ లోని టీటీడీ ఆలయ పరిసరాల్లో విజయ్, రష్మికలు సందడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో, విజయ్ తన భార్య రష్మికకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ కనిపించాడు. ఆమె చుట్టూ రక్షణగా ఉంటూ.. భక్తుల మధ్య నుంచి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లడం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

కొత...